శ్రీ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి అధికారిక ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవోతో పాటు అర్చక బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలంపూర్‌లో ఘనంగా నిర్వహించనున్న శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Post a Comment