-->

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు పోటెత్తిన భక్తులు

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు పోటెత్తిన భక్తులు


జనవరి 16, 2026: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు.

ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ ప్రాంతాల వరకు వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఈ కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అధికారులు వాహనాలను సమీపంలోని పొలాల వైపు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఘనంగా జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793