-->

గోడపత్రికలను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

గోడపత్రికలను ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన విద్యావేత్త, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మండల అవతరణ దశాబ్ది ఉత్సవాలు మరియు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన గోడపత్రికలను పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు దోహదపడే విధంగా హరిహర ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలను జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే మండల ప్రజలకు ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, కొమరయ్య, సమన్వయకర్త మచ్చ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793