-->

నాగ్‌పూర్లో భారీ పేలుడు.. 15 మంది మృతి

నాగ్‌పూర్లో భారీ పేలుడు.. 15 మంది మృతి


మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కటోల్ ప్రాంతంలోని ఎస్‌బీఎల్ (SBL) పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఈ పరిశ్రమలో డిటోనేటర్లు మరియు భూగర్భ తవ్వకాల కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు తయారు చేస్తుంటారు. ప్రమాదం సంభవించిన సమయంలో 30 మందికిపైగా కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలిసింది. పేలుడు తీవ్రతకు పరిశ్రమ భవనం భారీగా ధ్వంసమైంది.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉన్నందున సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. జిల్లా అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793