-->

వడ్డీ ఆశ చూపి రూ.25 కోట్లు వసూలు చేసి మహిళ పరార్

హైదరాబాద్‌లో భారీ మోసం: వడ్డీ ఆశ చూపి రూ.25 కోట్లు వసూలు చేసి మహిళ పరార్


Hyderabad: అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పలువురి నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని సుమారు రూ.25 కోట్లకు పైగా మోసం చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటన Vanastalipuram పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మబలికి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకుంది. అనంతరం ఆమె రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా తన ఇంటిని ఒకరికి అగ్రిమెంట్ చేసి, అదే ఇంటిని మరో వ్యక్తికి సేల్ డీడ్ చేయడంతో బాధితులు మోసపోయామని చెబుతున్నారు. తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితులు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.

ఈ వ్యవహారంపై ఇటీవల పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం కూడా ఒక వ్యక్తి రూ.46 లక్షలు ఇచ్చినా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు Mahesh తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793