-->

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాప్ దగ్ధం

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాప్ దగ్ధం


Hyderabad నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని Miyapur పరిధిలోని Chandanagar పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

భవనంలో ఉన్న పెద్ద ఎత్తున ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదైంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్ని ప్రమాదం జరిగిన భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని Balanagar ఏసీపీ తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793