-->

ప్రేమ జంట అదృశ్యం… ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహాలు లభ్యం

జగిత్యాల జిల్లా ప్రేమ జంట అదృశ్యం… ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహాలు లభ్యం


జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ జంట మృతదేహాలు ఎస్సారెస్పీ (SRSP) కాలువలో లభించడంతో ప్రాంతంలో కలకలం రేగింది.

పోలీసుల వివరాల ప్రకారం, మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్రకు చెందిన వలస కూలీ అంకుశ్ మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో యువతికి బైక్ నడపడం నేర్పుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

బైక్‌తో పాటు ఇద్దరూ అదుపుతప్పి కాలువలో పడిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.

ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదమా లేదా మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793