-->

భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టిన భార్య.. ముగ్గులతో దాచిన ఘోరం బయటపడింది

భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టిన భార్య.. ముగ్గులతో దాచిన ఘోరం బయటపడింది


అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలం:
మనసును కలిచివేసే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందే ముగ్గు వేయాల్సిన ఇల్లాలు.. అదే చోట భర్తను హత్య చేసి పాతిపెట్టడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన హనుమంతు, సుకన్య దంపతులు. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉంది. అయితే హనుమంతుకు మద్యం అలవాటు ఉండటంతో గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

సుమారు నాలుగు నెలల క్రితం, మద్యం సేవించి ఇంటికి వచ్చిన హనుమంతుతో సుకన్య మళ్లీ గొడవపడింది. ఈ క్రమంలో క్షణికావేశంలో, కూతురు అడ్డుకున్నా వినకుండా రోకలిబండతో అతనిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాల వల్ల హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య బయటపడకుండా ఉండేందుకు సుకన్య పన్నిన ప్లాన్ భయంకరంగా మారింది. ఇంటి ముందే గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా ప్రతిరోజూ కళ్లాపి జల్లి ముగ్గు వేస్తూ ఉండేది.

అయితే శుక్రవారం తల్లి–కూతురు మధ్య జరిగిన గొడవతో ఈ ఘోరం బయటపడింది. మాటామాటా పెరగడంతో కుమార్తె తండ్రి హత్య విషయాన్ని బయటపెట్టింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించగా, సుకన్య స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793