-->

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. హీరో భరత్ కాంత్ మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. హీరో భరత్ కాంత్ మృతి


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

రంగారెడ్డి జిల్లా బొంగులూరు గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటన స్థలంలోనే భరత్ కాంత్, త్రిలోక్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల విడుదలైన టెనెంట్ సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించి గుర్తింపు పొందారు. తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా ఆయన నటించారు. మరోవైపు త్రిలోక్ పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసి సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

భరత్ కాంత్, త్రిలోక్ ఇద్దరూ నెల్లూరుకు చెందిన చిన్ననాటి స్నేహితులు. సినీ రంగంపై ఆసక్తితో దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఇలా అర్ధాంతరంగా ఇద్దరూ మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793