-->

యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నిజాయితీకి ప్రశంసలు

యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నిజాయితీకి ప్రశంసలు


Yadagirigutta Templeలో ఓ ఆటో డ్రైవర్ ప్రదర్శించిన నిజాయితీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన సత్యశ్రీ అనే భక్తురాలు కొండపైకి వెళ్లేందుకు హరిబాబు ఆటోలో ప్రయాణించారు. ఈ సమయంలో ఆమెకు తెలియకుండానే సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు ఆటోలో జారిపడిపోయింది.

ఆటోలో బంగారు గొలుసు కనిపించడంతో హరిబాబు ఏమాత్రం దురాశకు లోనుకాకుండా వెంటనే ఎస్పీఎఫ్ కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రకటన చేయడంతో బాధితురాలు సత్యశ్రీని గుర్తించారు.

అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్, ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు సమక్షంలో బంగారు పుస్తెలతాడును బాధితురాలికి అప్పగించారు. హరిబాబు చూపిన అసాధారణ నిజాయితీని ఆలయ అధికారులు, భక్తులు ప్రత్యేకంగా అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793