-->

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి


Mahabubnagar జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన పాలకొండ చౌరస్తా వద్ద జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం.. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

అయితే మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793