శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం.. తుంగభద్ర నదిలో నలుగురు మృతి
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సరదాగా నదిలో ఈతకు వెళ్లిన వారిలో తొలుత ఇద్దరు నీటిలో దిగారు. అయితే ప్రమాదవశాత్తు వారు లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోతుండగా, వారిని రక్షించేందుకు మరో ఇద్దరు నీటిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నలుగురు కూడా నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు.
మృతులు కర్ణాటక రాష్ట్రంలోని కురిడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం నలుగురు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. శ్రీరామనవమి రోజున జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment