-->

కూలీల వేషంలో మావోయిస్టులు.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న పోలీసులు

 

కూలీల వేషంలో మావోయిస్టులు.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న పోలీసులు

తాండూరు: తప్పించుకుని తిరుగుతున్న మావోయిస్టుల కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. రుక్మాపూర్ రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళా మావోయిస్టుపై అక్కడి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఇటీవల కూలీల వేషంలో రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పనులకు చేరి, గత పది రోజులుగా అక్కడే ఉంటూ పని చేస్తున్నట్లు గుర్తించారు.

మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర పోలీసులు, తాండూరు పోలీసుల సహకారంతో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రుక్మాపూర్ రైల్వే హెడ్‌క్వార్టర్స్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793