-->

తిమ్మాపూర్‌లో ఎస్‌ఐపై దాడి.. నిందితుడు అరెస్ట్

తిమ్మాపూర్‌లో ఎస్‌ఐపై దాడి.. నిందితుడు అరెస్ట్


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన గొడవలో పోలీసు అధికారిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సమాధానపరుస్తూ మాట్లాడుతున్న సమయంలో చెన్నబోయిన రమేష్ అనే వ్యక్తి ఆగ్రహానికి లోనై విధుల్లో ఉన్న ఎస్‌ఐ కాలర్ పట్టుకుని దాడి చేసి తోసేశాడు.

ఈ ఘటనపై సమాచారం ఉన్నతాధికారులకు చేరడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రమేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి.

ఇదిలా ఉండగా, కేసు నమోదు చేయకుండా ఉండాలని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే ఘటనను తీవ్రంగా తీసుకున్న పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793