లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కూకట్‌పల్లిలో కమ్యూనిటీ ఆర్గనైజర్
హైదరాబాద్: కూకట్‌పల్లి జోన్‌లోని మూసాపేట్ సర్కిల్–53లో పనిచేస్తున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ.20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రతి లక్షకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.18,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడి నుంచి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ACB అధికారులు కె. మురళిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ సేవకులు ఎవరైనా లంచం కోరినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అదనంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB అధికారులు వెల్లడించారు.

Post a Comment