-->

టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. ఐదంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి

టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. ఐదంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి


హైదరాబాద్: నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఈ భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793