గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు
కరీంనగర్, మార్చి 07: కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో నగదు మరియు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
కరీంనగర్ నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలోని రెండు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద, లక్ష్మీనగర్‌లోని ఆయన సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఒకేసారి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment