హింసాత్మక చర్యల ద్వారా ఏమి సాధించలేరు: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad, మార్చి 07: ముఖ్యమంత్రి Revanth Reddy ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, గన్‌మెన్‌లు ఉన్నారు.
శనివారం Hyderabadలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో డీజీపీ Shivadhar Reddy ఆధ్వర్యంలో సీఎం Revanth Reddy సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై హింసకు తావు లేదని అన్నారు. హింసాత్మక చర్యల ద్వారా ఏమి సాధించలేమని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేసి, వారిలో విశ్వాసం కలిగించారని అభినందించారు. లొంగిపోయిన మావోయిస్టులు సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీకి చెందిన మొత్తం 130 మంది 124 తుపాకులతో లొంగిపోవడం విశేషం. వీటిలో 31 ఏకే-47 తుపాకులు ఉన్నాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను సీఎం పరిశీలించారు.
లొంగిపోయిన వారిలో 125 మంది Chhattisgarhకు చెందినవారు, 4 మంది Telanganaకు చెందిన అజ్ఞాతంలో ఉన్నవారు, ఒకరు Andhra Pradeshకు చెందినవారని డీజీపీ వెల్లడించారు.

Post a Comment