మద్యం మత్తులో తల్లిపై కుమారుడి దాడి… ప్రాణాపాయ స్థితిలో మహిళ
మహబూబాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఉన్న కుమారుడు తన తల్లిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది.
గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమపై ఆమె కుమారుడు అజీమ్ మద్యం మత్తులో అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో లచ్చమకు రెండు చేతులు, మెడ వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి.
దాడి అనంతరం ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Post a Comment