-->

పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా


జనగామ జిల్లాలోని కొన్ని గ్రామాలు మద్యపానానికి గట్టిగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాయి. గ్రామస్తుల సమ్మతితో స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి గ్రామాలతో పాటు రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మద్యపాన నిషేధ తీర్మానం అమల్లో ఉంది. గ్రామాల్లో ఎవరైనా మద్యం అమ్మితే లేదా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకునేలా గ్రామ సభలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ తీర్మానం ప్రకారం గ్రామంలో మద్యం అమ్మితే రూ.1 లక్ష జరిమానా విధించనున్నారు. అలాగే మద్యం తాగినవారిని లేదా అమ్మినవారిని పట్టించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు.

గ్రామాల్లో శాంతి భద్రతలు మెరుగుపడటంతో పాటు కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్థులు ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793