దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ (DOST) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ ఈ దోస్త్ విధానంలో నిర్వహించనున్నారు.
మొదటి విడత వివరాలు
ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. అర్హులైన విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
రెండో విడత వివరాలు
మే 15 నుంచి మే 25 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ ఉంటుంది. మే 15 నుంచి మే 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. మే 30న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
మూడో విడత వివరాలు
మే 31 నుంచి జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. జూన్ 20న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
అడ్మిషన్ & తరగతులు
సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య సంబంధిత కాలేజీల్లో హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. జూన్ 29, 30 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
గమనిక: రెండో, మూడో విడతల్లో కూడా సీటు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి.


Post a Comment