-->

🔥 బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. పేలుడుతో కలకలం 🔥

🔥 బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. పేలుడుతో కలకలం 🔥


 ఏప్రిల్ 13: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విరుధ్‌నగర్ జిల్లా సాత్తూరు ప్రాంతంలో ఉన్న ఎక్సెల్ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ అంతటా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

పేలుడు తరువాత పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించి భయాందోళనకు గురిచేశాయి. ఫ్యాక్టరీ సమీపంలో పార్క్ చేసిన వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తీవ్రంగా గాయపడిన కార్మికులను సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు తీవ్రత కారణంగా ఫ్యాక్టరీలోని కనీసం ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో సుమారు 60 మంది కార్మికులు లోపల ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

టపాసుల తయారీ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఫ్యాక్టరీలో ఇంకా కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

👉 ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793