-->

నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ

నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో ట్యాలీ మరియు డీటీపీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాలను బహుకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ లిమిటెడ్ వ్యవస్థాపకులు డా. దేవినేని సుబ్బారావు, పాండ పున్నయ్య కుటుంబ సభ్యులు శ్రీమతి శారద, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి జ్యోష్న, శ్రీమతి సునీత, శ్రీమతి పి. రాజేశ్వరి, శ్రీమతి నీలిమ, శ్రీమతి జయశ్రీ, శ్రీమతి రాణి, శ్రీమతి రమా దేవినేని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీటీపీ కోర్సు పూర్తి చేసిన సి.హెచ్. చిద్విలాసిని మాట్లాడుతూ, మహిళా సాధికార కేంద్రం తమలాంటి వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. తాను ఈ శిక్షణ అనంతరం HFCL సంస్థలో నెలకు ₹12,000 వేతనంతో ఉద్యోగం పొందినట్లు చెప్పారు.

అతిథుల చేతుల మీదుగా ట్యాలీ మరియు డీటీపీ కోర్సుల యోగ్యత పత్రాలు అందజేశారు.

శ్రీమతి జ్యోష్న మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి నవ సంస్థ కృషి చేస్తోందని, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని సూచించారు.

మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1975లో ప్రారంభమైన నవభారత్ సంస్థ అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. నవభారత్ ఉన్నత పాఠశాలలో సుమారు 10,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత విద్య అందించామని, 2010 నుంచి HELP కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

నవభారత్ కంటి వైద్యశాలలో 10 లక్షల మందికి పైగా వైద్య సేవలు, 55,000 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని, అలాగే 29 గ్రామాల్లో సురక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళా సాధికార కేంద్రం ద్వారా ఇప్పటివరకు 4,600 మందికి పైగా శిక్షణ పొందినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సి.హెచ్. శ్రీనివాసరావు (CSR మేనేజర్), టీ. అరుణ, దివ్య, శిరీష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793