-->

విజయవాడ - హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

విజయవాడ - హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం


హైదరాబాద్, ఏప్రిల్ 03: తెలుగు రాష్ట్రాల ప్రజలకు విమానయాన రంగం నుంచి శుభవార్త అందింది. Fly91 ఎయిర్‌లైన్స్ సంస్థ, Vijayawada International Airport నుంచి Rajiv Gandhi International Airport వరకు రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు.

ఈ నెల 10వ తేదీ నుంచి మొదటి సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ విమానం హైదరాబాద్ నుంచి ఉదయం 6:05 గంటలకు బయల్దేరి, 7:10 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 7:30 గంటలకు బయల్దేరి, 8:40 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.

అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ సర్వీస్ విజయవాడ నుంచి ఉదయం 10:10 గంటలకు బయల్దేరి, 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు సర్వీసులకు టికెట్ ధరలు రూ.4,000 నుంచి రూ.8,000 మధ్య ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న UDAN Scheme ద్వారా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ, చిన్న పట్టణాలను ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని కడప, కర్నూలు విమానాశ్రయాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793