బ్యాగులో బంగారం, నగదు.. మానవత్వం చాటిన ఊబర్ డ్రైవర్
హైదరాబాద్, ఏప్రిల్ 24, 2026: నగరంలో ఒక ఊబర్ ఆటో డ్రైవర్ తన నిజాయితీతో మానవత్వాన్ని చాటాడు. సైఫాబాద్ ప్రాంతంలో ఊబర్ ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ, దిగిన తర్వాత తన బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయింది.
ఆటో డ్రైవర్ ప్రయాణం ముగిసిన తర్వాత బ్యాగ్‌ను గుర్తించి, దానిని తెరిచి చూసి అందులో విలువైన వస్తువులు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు.
పోలీసులు బ్యాగ్‌ను పరిశీలించగా అందులో సుమారు 6.5 తులాల బంగారం, రూ.3,500 నగదు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాధిత మహిళను సంప్రదించి, ఆమెకు బ్యాగ్‌ను సురక్షితంగా తిరిగి అందజేశారు.
డ్రైవర్ చూపిన నిజాయితీకి మెచ్చిన పోలీసులు అతన్ని సన్మానించి, నగదు బహుమతి అందించారు. ఈ ఘటన సమాజంలో ఇంకా మానవత్వం జీవించి ఉందని మరోసారి నిరూపించింది.

Post a Comment