-->

జగిత్యాల నివాసంలో కేటీఆర్ భేటీ అనంతరం జీవన్ రెడ్డి కామెంట్స్

జగిత్యాల నివాసంలో కేటీఆర్ భేటీ అనంతరం జీవన్ రెడ్డి కామెంట్స్


కరీంనగర్, ఏప్రిల్ 09: జగిత్యాల నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ తన నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం భావోద్వేగానికి గురిచేసిందని, అయితే బీఆర్ఎస్‌లో చేరడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

గత 20 నెలలుగా అనేక అవమానాలను తట్టుకుని ఓపిక పట్టానని, ఎన్నో ప్రభుత్వాలు చూసిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో సాగుతోందని విమర్శించారు. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు.

తాను నందమూరి తారక రామారావు, మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, అలాగే కేసీఆర్ ప్రభుత్వాలను చూసినట్టు తెలిపారు. అయితే కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793