సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు 13,343 మంది అర్హత
సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు 13,343 మంది అర్హత
న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్ర ప్రజా సేవా సంఘం (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన 13,343 మంది అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. గత నెల మే 24న దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలకు సుమారు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో మొత్తం 1,016 ఖాళీల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నారు.
అభ్యర్థులు తమ ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్ అయిన లో పరిశీలించవచ్చు. ఫలితాల పీడీఎఫ్‌లో రోల్ నంబర్ల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను UPSC వెల్లడించింది.
ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం అవసరమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి తదుపరి దశకు సిద్ధం కావాలని UPSC సూచించింది.

Post a Comment