-->

గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు.. కమర్షియల్ వినియోగదారులకు మరో షాక్

గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు.. కమర్షియల్ వినియోగదారులకు మరో షాక్


దేశవ్యాప్తంగా ఎల్పీజీ వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పడింది. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1 నుంచి కొత్త రేట్లను అమల్లోకి తీసుకువచ్చాయి. తాజా సవరణలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఢిల్లీలో రూ.42 మేర పెంచగా, కోల్‌కతాలో రూ.53.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50కు, కోల్‌కతాలో రూ.3,255.50కు చేరుకుంది. 

హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే కమర్షియల్ సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతుండటంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పెంపుతో ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 

ఇక 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.821.50కు చేరింది. 

అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విధంగా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో గృహావసర సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. 

ప్రధాన నగరాల్లో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు

Delhi – రూ.913

Kolkata – రూ.939

Mumbai – రూ.912.50

Chennai – రూ.928.50

Hyderabad – రూ.965

Lucknow – రూ.950.50

Patna – రూ.1,002.50

Bengaluru – రూ.915.50 

ఈ ఏడాది జనవరిలో రూ.1,691.50గా ఉన్న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర, వరుస పెంపులతో ప్రస్తుతం రూ.3,113.50కు చేరుకోవడం గమనార్హం. ముఖ్యంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఎల్పీజీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 

వ్యాపార అవసరాల కోసం వంటగ్యాస్‌పై ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, చిన్న పరిశ్రమలపై ఈ తాజా ధరల పెంపు గణనీయమైన ప్రభావం చూపనుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793