తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఉద్యమకారులు
తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఉద్యమకారులు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి కేజీఎస్ మ్యాథ్యూస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తొలిదశ, మలిదశ ఉద్యమకారులు, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కొత్తగూడెం పోస్టాఫీస్ సమీపంలో కేజీఎస్ మ్యాథ్యూస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యమకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యాథ్యూస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు అవతరణ దినోత్సవం గర్వకారణమని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సేవలను గుర్తిస్తూ వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఫోరం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ముఖ్యమంత్రి దృష్టికి ఉద్యమకారుల సమస్యలను పలుమార్లు తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే మార్గం సుగమమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పి. రామచందర్, కామేశ్వరరావు, రాజయ్య, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతి, గౌస్, పురుషోత్తం, మాతి నాగేశ్వరరావు, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, టి. వెంకట రాజయ్య, గోడ రమేష్, శ్రీహరి, కామేశ్వారారావు, నాగేశ్వరావు, దామేరాకొండ మల్లయ్య నిమ్మతోట రోజా, తదితర నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment