-->

రేపు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ అంకిత్

రేపు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ అంకిత్

రేపు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 16: రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా యూరియా అవసరాన్ని నమోదు చేసి సులభంగా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బుకింగ్ పూర్తయిన అనంతరం రైతులకు ప్రత్యేక బుకింగ్ ఐడీ జారీ అవుతుందని, ఆ ఐడీ ఆధారంగా సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను పొందవచ్చని వివరించారు.

ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం, రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉండేలా చూడడం ఈ యాప్ ప్రధాన లక్ష్యమని బాబురావు తెలిపారు. ఈ సాంకేతిక సౌకర్యాన్ని జిల్లాలోని రైతులందరూ సద్వినియోగం చేసుకొని అవసరమైన యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవాలని ఆయన కోరారు.

రైతులకు సులభతర సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వ్యవసాయ రంగంలో మరింత సమర్థవంతమైన ఎరువుల పంపిణీకి దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793