-->

రోగుల కోసం ఉచిత బ్యాటరీ ఆటో సేవ

రోగుల కోసం ఉచిత బ్యాటరీ ఆటో సేవ

రోగుల కోసం ఉచిత బ్యాటరీ ఆటో సేవ

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి దుబ్బాక శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత బ్యాటరీ ఆటోను బహుకరించారు. స్వామి సమర్థ మహారాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవను ప్రారంభించారు.

ఆశ్రమ నిర్వాహకులు రఘు మాట్లాడుతూ, పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే రోగులు, వృద్ధులు, గర్భిణీలు మరియు ఆసుపత్రి సిబ్బంది ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆటోను అందించినట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ బ్యాటరీ ఆటో సేవను పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే, ఎండలు మరియు వర్షాల సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులు రోడ్డుపై ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్వామి సమర్థ మహారాజ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆసుపత్రి రహదారికి ఇరువైపులా రెండు బస్ షెల్టర్లను ఆశ్రమం తరఫున నిర్మించి ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ సేవలు రోగులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793