-->

జాన్ పహాడ్ దర్గాలో మౌలిక సదుపాయాల కొరతతో భక్తుల ఇబ్బందులు

జాన్ పహాడ్ దర్గాలో మౌలిక సదుపాయాల కొరతతో భక్తుల ఇబ్బందులు

జాన్ పహాడ్ దర్గాలో మౌలిక సదుపాయాల కొరతతో భక్తుల ఇబ్బందులు

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జాన్ పహాడ్ దర్గా వద్ద మౌలిక సదుపాయాల లేమితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్రత్ సయ్యద్ మోహియుద్దీన్ షాహిద్, హజ్రత్ సయ్యద్ జాన్ పాక్ షాహిద్ దర్గాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

అయితే వేల రూపాయలు ఆదాయం ఉండి, భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ, దర్గాకు చేరుకునే రహదారి సరిగా లేకపోవడం, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, విశ్రాంతి గదులు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్గా అభివృద్ధి కోసం తెలంగాణ మంత్రి నల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల రూ.1 కోటి నిధులు కేటాయించినప్పటికీ, ఆ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఇప్పటికీ భక్తులకు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వసతి గదులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు ఇంకా పూర్తికాకపోవడం నిరాశ కలిగిస్తోంది.

"ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర స్థలంలో కనీస సదుపాయాలు కూడా లేకపోవడం బాధాకరం. ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలి" అని భక్తులు కోరుతున్నారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా రహదారులు, తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం సంబంధిత శాఖలు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793