-->

రేపటి నుంచే తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం.. ఆర్టీసీకి ప్రత్యేక ఆదేశాలు

రేపటి నుంచే తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం.. ఆర్టీసీకి ప్రత్యేక ఆదేశాలు

రేపటి నుంచే తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం.. ఆర్టీసీకి ప్రత్యేక ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని రూట్లలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకునేలా వారి స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

అలాగే, గతంలో నిర్వహించిన పాత రూట్లను పునరుద్ధరించడంతో పాటు బస్సుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు ట్రిప్పులు కూడా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కాగా, 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉండనున్నాయి. పాఠశాలల పునఃప్రారంభంతో లక్షలాది మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ చేపడుతున్న ఈ చర్యలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793