-->

సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం: కల్వకుంట్ల కవిత

సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం: కల్వకుంట్ల కవిత

సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం: కల్వకుంట్ల కవిత

రామగుండం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా రామగుండం ఓసీపీ-3, బేస్ వర్క్‌షాప్‌లను సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను తెలుసుకుని వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.

సింగరేణిలో ఇప్పటికీ బ్రిటీష్ పాలన తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు. అధికారులు కార్మికులను వేధిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై ఛార్జ్‌షీట్లు, మెమోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో అధికారులు ఆందోళనలు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవని, కార్మికుల విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు.

తాను టీజీబీకేఎస్‌లో ఉన్న సమయంలో అమలులోకి వచ్చిన కొన్ని విధానాల వల్ల కార్మికులకు ఆర్థిక నష్టం జరిగిందని అంగీకరించిన కవిత, ఆ తప్పిదాలకు కార్మికులకు క్షమాపణలు తెలిపారు. ఆత్మపరిశీలన చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, హెచ్‌హెచ్‌డీ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

మెడికల్ స్కీమ్‌ను పారదర్శకంగా అమలు చేయాలని, రిఫరల్ ఆస్పత్రుల్లో కార్మికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు సింగరేణి కార్మికులకు అందుబాటులో ఉన్న విద్యా, వైద్య సదుపాయాలు క్రమంగా బలహీనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అలియాస్ పేర్ల పేరుతో విజిలెన్స్ కేసులు నమోదు చేయడం, డిపెండెంట్ ఉద్యోగాల మంజూరులో జాప్యం చేయడం సరికాదన్నారు. దాదాపు రెండు వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నెలకు రెండు సార్లు సింగరేణి మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని కోరారు.

ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్లకు తగిన ప్రమోషన్లు, భద్రతా ప్రమాణాలు కల్పించాలని అన్నారు. నాసిరకం వాహనాల వల్ల కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, దుమ్ము కాలుష్య సమస్యను కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సింగరేణి క్వార్టర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని పేర్కొంటూ, ఖాళీగా ఉన్న నివాసాలను ఆధునికీకరించి కార్మికులకు కేటాయించాలని సూచించారు. కార్మికులు నిర్మించుకున్న చిన్న షెడ్లను తొలగించే బదులు మానవత్వంతో వ్యవహరించాలని యాజమాన్యాన్ని కోరారు.

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రజాసేవ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేనను స్థాపించినట్లు కవిత తెలిపారు. బాయిబాట కార్యక్రమం ద్వారా కార్మికులను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. కార్మికుల పక్షాన నిలబడి పోరాడతానని, అవకాశం ఇస్తే ప్రజల కోసం నిజమైన మార్పు తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు.

సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై తమ పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని కవిత వెల్లడించారు. హెచ్‌ఎంఎస్‌కు, ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేనకు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793