-->

టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీ చేసిన ఐదుగురు అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీ చేసిన ఐదుగురు అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీ చేసిన ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న జరిగిన దోపిడీ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు తమ వద్ద బంగారం ఉందని చెప్పి ఓ రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారిని కొనుగోలు కోసం పిలిపించారు. అనంతరం తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని నమ్మబలికి, బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారు.

నిందితులు బాధితుడి ఫోన్‌పే ఖాతా ద్వారా రూ.21,000, క్రెడిట్ కార్డు ద్వారా రూ.20,640, అలాగే మద్యం కొనుగోలు కోసం వైన్ షాప్‌లో రూ.3,030 చెల్లింపులు చేయించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793