స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లో ఉండగా ఊడిన రెండు టైర్లు..!
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లో ఉండగా ఊడిన రెండు టైర్లు..!
కడప జిల్లా పులివెందులలో సోమవారం ఉదయం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో తీవ్ర కలకలం రేగింది.
ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురికాగా, సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? లేక సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనతో మరోసారి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Post a Comment