-->

జగిత్యాలలో వ్యాపారి పరార్.. అధిక వడ్డీ ఆశతో డబ్బులు ఇచ్చిన బాధితుల ఆందోళన

జగిత్యాలలో వ్యాపారి పరార్.. అధిక వడ్డీ ఆశతో డబ్బులు ఇచ్చిన బాధితుల ఆందోళన

జగిత్యాలలో వ్యాపారి పరార్.. అధిక వడ్డీ ఆశతో డబ్బులు ఇచ్చిన బాధితుల ఆందోళన

జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీలో నివసించే ఓ కిరాణా వ్యాపారి గత వారం రోజులుగా కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. దాదాపు 30 ఏళ్లుగా విజయపురి రోడ్డులో కిరాణా దుకాణంతో పాటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న ఆయన, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి సుమారు 60 నుంచి 70 మంది వద్ద భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు సమాచారం.

కొంతకాలంగా చిట్టీలు వేసినవారు, అప్పుగా డబ్బులు ఇచ్చినవారు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో సదరు వ్యాపారి వారం రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వ్యాపారి ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీసిన బాధితులకు మరో షాక్ తగిలింది. ఆ ఇల్లు ఇప్పటికే మరో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసి వారు అవాక్కయ్యారు.

ఇదిలా ఉండగా, సదరు వ్యాపారి ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పలువురు ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌లు మూతపడటంతో అనేక మంది ఆర్థికంగా నష్టపోయిన నేపథ్యంలో, ఈ ఘటన కూడా అదే కారణాలతో జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

తమ కష్టార్జితాన్ని తిరిగి పొందాలని బాధితులు అధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వ్యాపారి పరారుకు గల అసలు కారణాలు, అప్పుల మొత్తం, ఆర్థిక లావాదేవీల వివరాలు అధికారిక విచారణ అనంతరం మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793