-->

విద్యార్థులు, గ్రామస్థుల కోసం టిజీఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

 

విద్యార్థులు, గ్రామస్థుల కోసం టిజీఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

విద్యార్థులు, గ్రామస్థుల కోసం టిజీఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

తూప్రాన్, జూలై 3: విద్యార్థులు, గ్రామస్థులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా కొనయపల్లి పీటీ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మేడ్చల్ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఈ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయించినట్లు ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మండల పరిధిలోని కొనయపల్లి పీటీ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్థులు తమ రవాణా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మేడ్చల్‌కు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో చర్చించి, కొనయపల్లి నుంచి మేడ్చల్ వరకు నేరుగా బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయించారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, మాజీ వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్థుల సమక్షంలో బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు తమ సమస్యను పరిష్కరించి బస్సు సౌకర్యం కల్పించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బస్సు సర్వీస్‌తో విద్యార్థులు విద్యాసంస్థలకు, గ్రామస్థులు మేడ్చల్‌కు వెళ్లేందుకు ఇకపై సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793