సికింద్రాబాద్‌లో దారుణం.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేసిన దుండగులు
సికింద్రాబాద్‌లో దారుణం.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్, జూలై 4: సికింద్రాబాద్‌లోని పీజీ రోడ్ పరిధిలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పార్సీ ధర్మశాల గేటు సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు తలపై బలంగా దాడి చేసి హత్య చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, స్థానిక పూల వ్యాపారి మహ్మద్ తాజ్, పాత సామాన్ల వ్యాపారి నవీన్ కుమార్‌కు పాత పేపర్లు సేకరించే కన్నా, సిరాజ్‌లతో పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రతిరోజూ రాత్రి పార్సీ ధర్మశాల గేటు వద్ద ఫుట్‌పాత్‌పైనే నిద్రించేవారు.
శుక్రవారం ఉదయం తన దుకాణానికి వచ్చిన మహ్మద్ తాజ్, కన్నాను లేపేందుకు ప్రయత్నించగా అతడు రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రాంగోపాల్‌పేట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కన్నా తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, మహ్మద్ తాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రాంగోపాల్‌పేట్ సీఐ బి. సురేశ్ కుమార్ తెలిపారు.

Post a Comment