అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్
అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి వారి విధుల నిర్వహణపై ఆరా తీశారు. సిబ్బంది ఎన్ని షిఫ్టుల్లో పనిచేస్తున్నారో తెలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం ఆసుపత్రిలోని ప్రసూతి, డయాలసిస్, జనరల్ వార్డులను పరిశీలించారు. ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న మహిళల పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ వార్డులో మూడు షిఫ్టుల్లో సేవలు అందిస్తున్నట్లు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment