కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్ వద్ద కొమురం భీమ్ విగ్రహం ఆవిష్కరణ
కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్ వద్ద కొమురం భీమ్ విగ్రహం ఆవిష్కరణ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్ వద్ద ఆదివాసీ వీరుడు, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొమురం భీమ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొమురం భీమ్ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. “జల్, జంగల్, జమీన్” నినాదంతో భూమి, అడవి, నీటిపై ఆదివాసీల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కొమురం భీమ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇల్లందు క్రాస్‌రోడ్ వద్ద కొమురం భీమ్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఆయన స్ఫూర్తి ప్రజలకు నిరంతరం గుర్తుండేలా ఉంటుందని అన్నారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని కొమురం భీమ్‌కు నివాళులర్పించారు.

Post a Comment