-->

పాల్వంచ 45వ డివిజన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

 

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గాజర్ల వీరభద్రం, నాగా సీతారాములు, సిరిపురపు లలిత కుమారి

పాల్వంచ 45వ డివిజన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గాజర్ల వీరభద్రం, నాగా సీతారాములు, సిరిపురపు లలిత కుమారి

కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 45వ డివిజన్‌లో కార్పొరేటర్ నరేష్ ఆధ్వర్యంలోని టీమ్ 45 గజానన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శ్రీ సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాజర్ల వీరభద్రం గురువు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, పలువురు కార్పొరేటర్లు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ సుగుణ కుమారి, 28వ డివిజన్ కార్పొరేటర్ జెల్లి శ్రీలక్ష్మి, 58వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ దావూద్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు జయప్రకాష్, డివిజన్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.