తెలంగాణ రక్షణ సేన రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం కొరకు కీలక నియామకాలు
తెలంగాణ రక్షణ సేన రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం కొరకు కీలక నియామకాలు
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రక్షణ సేనలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పలు కీలక నియామకాలను ప్రకటించారు. రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను, మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇన్‌చార్జీని, 12 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించారు.
ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను ప్రకటించిన పార్టీ తాజాగా మరో 18 స్థానాలకు నియామకాలు చేపట్టడంతో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు నియమితులయ్యారు. అసెంబ్లీ, జిల్లా స్థాయి నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించినట్లు పార్టీ పేర్కొంది.
18 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు
ఆదిలాబాద్ – గోపు వేణుగోపాల్ యాదవ్
మహబూబ్‌నగర్ – దొడ్ల సౌజన్య రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – చింతల రాజలింగం
కుత్బుల్లాపూర్ – ఎత్తరి మారయ్య
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్ – కందాడి మోహికా రెడ్డి
నిజామాబాద్ రూరల్ – బానోత్ నరేశ్ నాయక్
నిర్మల్ – డాక్టర్ మాల్వె చంద్ర ప్రకాశ్
ఖానాపూర్ – మేస్రం దయాకర్
అంబర్‌పేట్ – కంచగిరి ప్రవీణ్ కుమార్
ఖైరతాబాద్ – దేవరి చంద్రశేఖర్
జూబ్లీహిల్స్ – హలీమా బేగమ్
హుజూరాబాద్ – కోకట్ల సంతోష్ యాదవ్
పటాన్‌చెరు – తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి
దేవరకొండ – నేనావత్ శివ నాయక్
నాంపల్లి – సయ్యద్ మతీన్ అహ్మద్
ఇల్లెందు – వాసం రామకృష్ణ దొర
అశ్వారావుపేట – సోడెం వెంకట్
మెదక్ లోక్‌సభ ఇన్‌చార్జీగా మద్ది శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.
జిల్లా అధ్యక్షుల నియామకం
రంగారెడ్డి – పురం మహేందర్ రెడ్డి, సంగారెడ్డి – మాసన్నగారి బాలయ్య, ఆదిలాబాద్ – బాపురావు రాథోడ్, నిర్మల్ – లోకిని రాము, కొమ్రం భీం ఆసిఫాబాద్ – కిరిమిల వినోద్ చారి, మంచిర్యాల – ఊదరి చంద్రమోహన్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి – నవీన్ గోగికర్, మహబూబ్‌నగర్ – డాక్టర్ ఎర్రంశెట్టి వెంకట్రామ్ మూర్తి, నిజామాబాద్ – మంథెన నవీన్ రెడ్డి, కరీంనగర్ – గుంజపడుగు హరిప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం – సముద్రాల క్రాంతి కుమార్, గ్రేటర్ హైదరాబాద్ – వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌లను జిల్లా అధ్యక్షులుగా నియమించారు.
అలాగే నిజామాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, మంచిర్యాల జిల్లాలకు ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించారు.
అనుబంధ విభాగాలకు కొత్త బాధ్యతలు
ఎంబీసీ, తెలంగాణ న్యాయ రక్షణ, ఎన్‌ఆర్‌ఐ వింగ్, ట్రేడ్ అండ్ కామర్స్, విద్యార్థి విభాగం, సోషల్ అండ్ డిజిటల్ మీడియా, ముస్లిం మైనారిటీ, రైతు, బంజారా, జర్నలిస్ట్ విభాగాలతో పాటు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్‌కు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యతలను పార్టీ ప్రకటించింది.
తాజా నియామకాలతో తెలంగాణ రక్షణ సేనను రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Post a Comment