-->

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి టీబీజీకేఎస్

 

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి టీబీజీకేఎస్

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి టీబీజీకేఎస్

కొత్తగూడెం: సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 8తో ముగిసిన నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించే వరకు సంస్థలోని అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి, సమాన న్యాయం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇన్‌క్లైన్ మైన్, వీకే ఓసీ మేనేజర్లకు టీబీజీకేఎస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున, సింగరేణిలో తదుపరి కార్మిక సంఘాల ఎన్నికలు జరిగే వరకు అన్ని సంఘాలను సమానంగా పరిగణించాలని, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రతి సంఘానికి సమాన అవకాశం కల్పించాలని వారు కోరారు.

సింగరేణిలో కార్మిక సంఘాల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా యాజమాన్యం వ్యవహరించాలని నాయకులు పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా కార్మికుల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కుసాని వీరభద్రం, ఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ నాయకులు గిన్నారపు మహేందర్, కాగితపు విజయ్ కుమార్, పీవీకే ఫిట్ సెక్రటరీ నమిల్ల వెంకటేశ్వర్లు, తిరుపతి, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు గోల్కొండ నవీన్, వినీత్, ఆలీం, అనుదీప్, ఎన్. శంకర్, దేవ్ సింగ్ నాయక్, వెంకటేశ్వర్లు, సంతోష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.