-->

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

 

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

బతుకమ్మ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం

హైదరాబాద్‌: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ (40) మృతి చెందారు. బతుకమ్మ కార్యక్రమాన్ని ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తున్న సత్యనారాయణ వాహనాన్ని ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సత్యనారాయణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.