కరీంనగర్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఒకరి అరెస్ట్!
కరీంనగర్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఒకరి అరెస్ట్!
కరీంనగర్: నగరంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్లోని లేబర్ అడ్డా వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నిందితుడి వద్ద నుంచి మొత్తం 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 908 గ్రాములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నిషేధిత మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నిందితుడిపై కేసు నమోదు చేశారు. నగరంలో మత్తు పదార్థాల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గంజాయి చాక్లెట్ల విక్రయాల వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది.

Post a Comment