రెవెన్యూ శాఖలో అధికారుల బదిలీలు.. కొత్త పోస్టింగ్లు
తెలంగాణ రెవెన్యూ శాఖలో అధికారుల బదిలీలు.. కొత్త పోస్టింగ్లు
హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో పాటు వెయిటింగ్లో ఉన్న కొందరు అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారు.
ప్రధాన బదిలీలు, నియామకాలు ఇవే..
- జగిత్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి. రాజా గౌడ్ను నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు.
- తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. ప్రసూనాంబను జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు.
- రవాణా, రోడ్లు-భవనాలు (హౌసింగ్) శాఖలో డిప్యుటేషన్పై ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి. వెంకట మాధవరావును నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించారు.
- మహబూబ్నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ పి. రామిరెడ్డిని వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా నియమించారు.
- వెయిటింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎ. యాదగిరికి మహబూబ్నగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) బాధ్యతలు అప్పగించారు.
- వెయిటింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ మోహన్ సింగ్కు రాజన్న సిరిసిల్ల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా పోస్టింగ్ ఇచ్చారు.
- డిప్యూటీ కలెక్టర్ పి. పద్మప్రియను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)లో సేవలందించేందుకు డిప్యుటేషన్పై నియమించారు. తొలుత ఏడాది పాటు ఎఫ్.ఎస్. నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఆమె సేవలు అందించనున్నారు.
- డిప్యూటీ కలెక్టర్ కృష్ణయ్యకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (యూఎల్సీ)గా పోస్టింగ్ కల్పించారు.
- తహసీల్దార్ జి. కుమారస్వామిని రాజన్న సిరిసిల్ల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) కార్యాలయం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) కార్యాలయానికి బదిలీ చేశారు.
ఈ ఉత్తర్వులతో ఆయా జిల్లాలు, కార్యాలయాల్లో రెవెన్యూ పరిపాలనకు సంబంధించి అధికారుల బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Post a Comment