మంచిర్యాలలో మహిళ హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
మంచిర్యాలలో మహిళ హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు
మంచిర్యాల: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసులో నిందితుడు వీరస్వామికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.1,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్ (ఎస్‌కేజడ్‌ఆర్)కు చెందిన భాగ్య (46) భర్త మరణించడంతో వీరస్వామితో కలిసి మంచిర్యాలలో సహజీవనం చేస్తోంది. అయితే వీరస్వామి తరచూ మద్యం సేవించి భాగ్యతో గొడవపడేవాడు. అంతేకాకుండా ఆమెను చంపేస్తానని బెదిరించేవాడు.
ఈ క్రమంలో 2024 డిసెంబర్ 8న డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహానికి గురైన వీరస్వామి బండరాయితో భాగ్య తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వీరస్వామికి జీవిత ఖైదుతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Post a Comment