కరీంనగర్‌లో చోరీ.. తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం!
కరీంనగర్‌లో చోరీ.. తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం!
కరీంనగర్: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఇనుకొండ దామోదర్ రెడ్డి కుటుంబం మూడు రోజుల క్రితం ఊరికి వెళ్లింది. శుక్రవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని వస్తువులను పరిశీలించగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
బాధితుల వివరాల ప్రకారం.. అర తులం బంగారం, 12 తులాల వెండి పట్టీలు, రూ.10 వేల నగదును దొంగలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Post a Comment