చెరువులో మునిగి బాలుడు మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
చెరువులో మునిగి బాలుడు మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
గేదెను తీసుకురావడానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులోకి దిగిన కలపాల ప్రవీణ్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. చెరువులో చిక్కుకున్న గేదెను బయటకు తీసుకురావడానికి బాలుడు ప్రవీణ్ చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గేదెను కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బాలుడి మృతితో గుర్రాల చెరువు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్న వయసులోనే బాలుడు మృత్యువాత పడటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తెలియవల్సివుంది.

Post a Comment